Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: May 17, 2014 14:32:18

చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌. అవును మీరు చదువుతోంది నిజమే. ఇప్పుడు పవన్ కల్యాన్‌ని ఎవరైనా ఇలాగే పిలుస్తున్నారట. ఎప్పుడైతే బాబు కోసం పవన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలు సుడిగాలి పర్యటనలు చేసి కలయతిరిగాడో అప్పటినుంచే ఆయన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇలా పిలవడం మొదలుపెట్టారు. వీళ్లిద్దరూ కలిసి ప్రచారానికి వెళ్లిన ప్రతీచోటల్లా.. ' పవన్ రూపంలో బాబుకు మరో నందమూరి హీరో దొరికాడు కదా' అని గుసగుసలు పెట్టుకోవడం కనిపించింది. గత ఎన్నికల్లో బాబుకు మద్దతుగా టీడీపీ తరపున ప్రచారం చేసి పెట్టడానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు ముందుకొచ్చారు. కానీ ఈసారి అలా జరగలేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా వుండగా, బాలయ్య మాత్రం ఆయన పోటీచేస్తున్న హిందూపురం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గా్లు చుట్టొచ్చాడు. అంతేకానీ జిల్లా దాటి బయటికి వెళ్లలేదు. అందుకే ఆ నందమూరి హీరోల లోటు పూడ్చుతూ వారి స్థానంలో వచ్చిన పవన్‌ని చూసి, నందమూరి పవన్ కల్యాణ్ అంటున్నారట టీడీపీ ఫ్యాన్స్. పార్టీ శ్రేణుల గుసగుసలకు తగినట్లుగానే ఎక్కడికి వెళ్లినా పవన్‌కు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా అంతే ప్రాధాన్యతని సంతరించుకుంది.  అటు రాజకీయవర్గాల్లో, ఇటు సినీవర్గాల్లో ఇప్పుడు ఆనోటా, ఈనోటా వినిపిస్తు్న్న గాసిప్స్‌లో ఇదీ ఒకటి.

 
Tags: చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1