Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: Apr 14, 2015 20:08:58

 

 

ఫేస్ బుక్ బాంధవ్యాల మధ్య చిచ్చు పెడుతోందని తాజా సర్వేలో తేలింది.  ఫేస్ బుక్‌లో తాము పోస్ట్ చేసిన ఫోటోలకు వచ్చిన లైకులకు లెక్కకట్టి గొప్పలు చెప్పుకుంటున్న వారు 72 శాతం మంది ఉన్నారని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తమ పోస్ట్‌లకు అత్యధికంగా లైకులు రావాలని కోరుకోగా, ఆశించిన మేరకు లైకులు రాకపోతే, ఏదో కోల్పోయామన్న భావన 58 శాతం మందిలో కలుగుతోందని సర్వే తేల్చింది. 64 శాతం మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ఇంటర్నెట్ చర్యలను కనిపెడుతుండగా, వారికి తెలియకుండా, 68 శాతం మంది నెట్‌లో చక్కర్లు కొడుతున్నారట.
 
తాజాగా గోపాల్, కిరణ్... ఫేస్ బుక్ ఇద్దరినీ కలిపింది. గోపాల్ ఒక ఫొటో పోస్ట్ చేయగా, కిరణ్ దాన్ని లైక్ చేయలేదు. అంతే, మిత్రబేధం మొదలు. కిరణ్‌ను కలిసిన గోపాల్, లైక్ ఎందుకు కొట్టలేదని అడిగి చితకబాదాడు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. 
 
ఇంకో సంఘటనలో అమ్మాయి ఫొటో వాట్స్ యాప్‌లో అప్‌లోడ్ చేయనందుకు గ్రూప్ అడ్మిన్‌‌పై ఓ తుంటరి దాడి చేశాడు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు రోజురోజుకూ పెరుగుతూ స్నేహ సంబంధాలు బెడిసి కొడుతున్నాయని ఓ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

 
Tags:  Facebook Craze Not Dying: Survey
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1