Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: Apr 14, 2015 21:24:14

 

సినిమా ఇండస్ట్రీలో ఏది సక్సెస్‌ అవుతుందో.. ఏది కాదో ఎవ్వరికీ తెలీదు. అత్తారింటికి దారేది.. చిత్రం విడుదల ముందు ఎక్కువ అంచనాలు లేవు. విడుదలయ్యాక.. వారం తర్వాత కలెక్షన్లు చూసి ఆశ్చర్యమేసింది. రెండోవారానికి అద్భుతమైన రిపోర్ట్‌ వచ్చింది. ప్రతి సినిమా బ్రహ్మాండగా వుండాలనిచూస్తాం... అలాగే సన్నాఫ్‌ సత్యమూర్తికూడా అంటూ... దర్శకుడు త్రివిక్రమ్‌ చెబుతున్నారు.
 
త్రివిక్రమ్‌తో కాసేపు.. 
 
ప్రశ్న:  సన్నాఫ్‌ సత్యమూర్తి రెస్పాన్స్‌ ఎలా వుంది? 
జ :  బాగానే వుంది. 
 
ప్రశ్న: మీరనుకున్న అంచనాలకు చేరిందా? 
జ : బేసిక్‌గా అంచనాలు వుండవు. సోమవారం దాకా ఆగాల్సిందే. ఎందుకంటే ఇది మాస్‌ 
సినిమా కాదుగా.. 
 
ప్రశ్న : కలెక్షన్లు ఎలా వున్నాయి? 
జ : బాగానే వున్నాయి. అయితే ఇంత వసూలు అయింది. అంత అయింది.. అని చెప్పుకోకూడదు. లాంగ్‌స్టాండింగ్‌తో చూడాల్సిందే. 
 
ప్రశ్న : మీ గత చిత్రాల మాదిరి వినోదంలేదనే కామెంట్‌ విన్పిస్తుంది? 
జ : ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది ఓ చట్రం. ఎప్పుడూ దాన్నే చెప్పకూడదు.. ఇంకా వేరే కథలు కూడా చెప్పాలికదా. ఎప్పుడూ అదే రాస్తుంటే.. ఇవేనా అంటారు. 
 
ప్రశ్న :  తండ్రీకొడుకుల కథ! అని ముందుగానే చెప్పడం వల్ల ప్రభావం చూపిందా? 
జ : సామాన్య ప్రేక్షకుడికి ఇలాంటి ఆలోచనలు రావు. నెగెటివ్‌గానూ ఆలోచించరు. 
 
ప్రశ్న : పెద్ద హిట్‌ అయిన చిత్రం తీశాక.. అంచనాలు ఎక్కువగా వుంటాయికదా? 
జ : ఎప్పుడో ఏడాది అయింది అత్తారింటికి.. తీసి. దానితో పోల్చకూడదు.
 
ప్రశ్న : 300కోట్లు వదులున్న హీరో కథ ఎలా తట్టింది? 
జ : ఇదంతా నా జీవితంలో చూసిన, జరిగిన సంఘటనలే రాసుకున్నాను. చాలా అనుభవాలు కూడా వున్నాయి. నా స్నేహితులు, చుట్టాల్లో వున్నారు. సినిమా కనుక డ్రమటైజ్‌ చేశాం. దాన్ని మానవీయకోణంలో చూపించాను. 300 కోట్లు పోతే.. దాన్నుంచి కోలుకోవడానికి ఏడాదిపైగా పడుతుంది. సినిమా కనుక తక్కువ టైంలో చెప్పాలి. అంతేకాకుండా.. ఎం.ఎస్‌.నారాయణ, రావురమేష్‌ సీన్స్‌కూడా నేను చూసినవే. 
 
ప్రశ్న : ప్రకాష్‌రాజ్‌, అల్లు అర్జున్‌ సీన్స్‌ కొంచెం వుంటే బాగుండేదేమో? 
జ : అలా వుంటే బాగుంటుందని నాకు ఎవ్వరూ చెప్పలేదు. తండ్రి గురించి చెప్పాలి కానీ, తండ్రిని చూపించి చెప్పాలనుకోలేదు. ఆయన లేకుండా చెప్పడం గొప్ప. తండ్రి ఆస్తులిచ్చి వుంటే ఎవరైనా గొప్పగా చెబుతారు. లేనప్పుడే చెప్పాలి. అదీ పాయింట్‌. 
 
ప్రశ్న : త్రివిక్రమ్‌ అంటే మాటల మాంత్రీకుడంటారు? 
జ : ఆ విషయం నాకు తెలీదు. కథ ప్రకారమే డైలాగ్‌లు పంచ్‌లు రాస్తాను. తండ్రి చనిపోయాక.. 15 నిముషాలు హీరో పంచ్‌లు వేస్తే వరస్ట్‌గా వుంటుంది. జులాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది వేరే టైప్‌లో చెప్పాను. అస్సలు మాటల మాంత్రీకుడంటేనే భయం. ఈ పేరు ఎలా వచ్చిందో.. 
 
ప్రశ్న: సెన్సిటివ్‌ పాయింట్స్‌.. హీరోను బట్టే పుడతాయా? 
జ : హీరో ఇమేజ్‌కోసం కాదు కానీ.. హీరోకు సెట్‌ అవ్వడానికోసం చేస్తాం. స్టోరీపరంగా వెళ్లడానికే నేను ప్రయత్నిస్తాను. 
 
ప్రశ్న : రివ్యూలను ఎలా ఆస్వాదిస్తారు? 
జ : వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను. పేపర్లే చదువుతాను. 
 
ప్రశ్న : స్నేహ పాత్ర పరిచయం వికృతంగా వుందనిపించింది? 
జ : నాకు ఎవ్వరూ చెప్పలేదు. సామాన్యుడికి బాగా నచ్చిందే. 
 
ప్రశ్న: కొన్ని సీన్స్‌ నవల్లోలాగా చెప్పారే? 
జ :  హీరో తనగురించి తాను చెప్పుకుంటూ ఫ్లాష్‌బ్యాక్‌ వెళ్ళడం కొత్తగా ఉండాలనిపించి అలా చేశాం. తను లిఫ్ట్‌లో కిందకి దిగడంతో జీవితంలో దిగడం ఆరంభమైందనీ, తర్వాత కారు... ఇట్లా... జీవితం ఎలా వుంటుందనేది తక్కువ సమయంలో చెప్పే ప్రయత్నం చేశాం. ఆ ఆలోచన నావెల్టీగా వుంటుంది. చెప్పే విధానం ఇలా వుంటేనే బాగుంటుందనిపించింది. 
 
ప్రశ్న: ఇందులో విలన్‌ ఎవరు? 
జ : సంపత్‌ అనే వ్యక్తి విలన్‌. కానీ ప్రత్యక్షంగా అతనని చెప్పం. కావాలని ప్రకాష్‌రాజ్‌ను చంపలేదు. ఉపేంద్రను చంపాలనుకున్న అతను పొరపాటున ప్రకాష్‌రాజ్‌ను చంపుతాడు. హీరో వల్ల ఎవరికీ అపాయం జరగకూడదనేది నా కథ. అందుకే.. సంపత్‌నుకూడా ఉపేంద్ర చంపలేదు. అనుకోకుండా ప్రకృతి బ్యాలెన్స్‌ వల్ల తను చనిపోతాడు. ఒక మనిషి డైరెక్ట్‌గా చంపడం అనేది నా చిత్రాల్లో చూపించను. హీరో విలన్‌ చంపితే కిక్‌ వుండదు. నేను నమ్మను. ఏదో అత్యవసరమయితేనే తప్ప. 'అతడు', 'జల్సా' నా చిత్రాలన్నింటిలోనూ విలన్‌ ఏదోక మిస్టెక్‌వల్లే చనిపోతాడు.
 
ప్రశ్న : హీరోయిన్‌ డయాబిటిక్‌గా చూపించడానికి కారణం? 
చాలా సింపుల్‌. ప్రతి మనిషిలోనూ లోపాలున్నట్లే.. హీరోయిన్లకు వుంటాయి. వారేమీ దేవతల్లా పైనుంచి దిగిరాలేదు. వారికీ ప్రేమలుంటాయి. పెండ్లి చేసుకుంటారు. కమర్షియల్‌ సినిమాల్లో గ్లామర్‌ హీరోయిన్‌ ఇలా చేయడం కొత్తగా అనిపిస్తుంది. అయితే డయాబెటిక్‌ వచ్చినవారు ఆసియా ఖండంలో ఇండియాలోనే ఎక్కువగా వున్నారు. వరన్నం తినడం వల్లనేమో, మన అలవాట్లవల్లనేమోకానీ.. అది భీకరమైనదనే ఫీలింగ్‌ వచ్చినవారికి వుంటుంది. కానీ, కమల్‌హాన్‌కు వచ్చిందని తెలియగానే షాక్‌ అయ్యాను. ఫేమస్‌ యాంకర్‌ గౌవర్‌కపూర్‌, వసీం అక్రమ్‌ వంటివాళ్ళకు వుంది. కానీ వారు చాలా ధైర్యంగా హాండిల్‌ చేశారు. దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌లో చూపిస్తే ఎలా వుంటుంది అనేది నేను సమంతతో చేయించాను. 
 
ప్రశ్న : విడుదలకు ముందు మిక్స్‌డ్‌ టాక్‌ వుంటుందని భావించారా? 
జ : నిజంగా సినిమా తీసిన ఎవ్వరికీ ఏమీ తెలీదు. చూసిన వారికి తెలీదు. ప్రతి సినిమా అత్తారింటికి.. లా ఆడాలని అనుకుంటాం. తీసేటప్పుడు తీశాక మాకూ తెలీదు. వారం తర్వాతే.. ఈ సినిమా ఇంత వుందా? దుమ్ముదులుపుతుంది.. అని తెలుస్తుంది. 
 
ప్రశ్న: ఖలేజా టీవీల్లో హిట్‌ కదా? 
జ : దానికి బాధపడాలో, ఆనందపడాలో అర్థంకాలేదు. మనం టీవీకి పనికివచ్చే సినిమాలే తీస్తున్నామా? అనిపిస్తుంది. టీవీల్లో చూసేవిధానం తేడా వుంటుంది. చాలా రిలాక్స్‌గా చూస్తాం. మధ్యలో ప్రకటనలు వస్తాయి. బోర్‌కొడితే ఫోన్‌ మాట్లాడతాం. మంచి సీన్‌ వస్తే ఎంజాయ్‌ చేస్తాం. కానీ థియేటర్‌లో చూడాలంటే అప్పటి పరిస్థితినిబట్టి మైండ్‌ సెట్‌నుబట్టి వుంటుంది. 
 
ప్రశ్న: పవన్‌, అర్జున్‌, మహేష్‌తోనే సినిమా చేస్తారా? 
జ : అదేం కాదు. కుదరలేదంతే. 
 
ప్రశ్న : రాజమౌళి హీరోలతో త్రివిక్రమ్‌ తీయడంలేదని కామెంట్‌ వుంది? 
జ : అందుకే నేను వెబ్‌సైట్లు చూడంది. అవి చదవకపోవడంవల్లే సుఖంగా వుందనిపిస్తుంది. 
 
ప్రశ్న: మీ చిత్రాలన్నీ 40కోట్లుపైనే వుండానికి కారణం? 
జ : నేను బడ్జెట్‌ గురించి ఆలోచించను. ముందుగా కథ అనుకుంటాను. దాన్ని రాసుకుని ఫైనల్‌ అయ్యాక నిర్మాత ఎవరు? బడ్జెట్‌ ఎంత కావాలి? కమర్షియల్‌గా ఎంత పే చేస్తుంది? అనేది ఆలోచిస్తాను. 
 
ప్రశ్న:  హీరోల కోసమే కథలు రాస్తారా? 
జ : హీరోల కోసమే కథలు రాయడం అనేది అబద్ధం. రాస్తాం. కానీ అదే టైంలో నేను చెప్పాలనుకున్న విలువల్నికూడా చెప్పేందుకు ప్రయత్నిస్తా. 
 
ప్రశ్న : ఒక్కో సీజన్‌లో గొప్పచిత్రాలు వస్తుంటాయి? 
జ : ఒక్కో సీజన్‌లో ఒకలా తీస్తామనేగా.. అవును మనుషులు మారుతుంటాయి. కాలం మారుతుంటుంది. ఆ కాలంలో తీస్తే త్రివిక్రమ్‌ బ్రాండ్‌ అంటారు. అది వింటేనే భయమేస్తుంది. నాకు నచ్చిందే తీస్తాను. నచ్చితే చూడండి. లేదంటే తిట్టండి. దేన్నీ సీరియస్‌గా తీసుకోను. సింపుల్‌గా వుండడానికి ప్రయత్నిస్తా. నాకు చాలా కాంప్లికేషన్స్‌ వున్నాయి. లక్ష ఇబ్బందులుంటాయి. నాకు జలసీ, ఇగో, నా సినిమానే ఆడాలని వుంటుంది. కానీ దాన్ని బయటకు చెప్పను. బయట బాగా మాట్లాడాలనిపిస్తుంది. ఇవన్నీ వదిలేసి సింపుల్‌గా వుండాలనిపిస్తుంది. భీమవరంలో సినిమా చూసినప్పుడు ఎలా వున్నానో అలానే వుండాలనిపిస్తుంది. కాదు. నా సినిమానే ఆడాలని కూడా అనిపిస్తుంది. మరి మిగతవారి సినిమాలు ఆడకపోతే.. రేపు నాతే సినిమా ఎవరు తీస్తారు. మనం ఎంత బాగా ఆలోచించినా.. మైండ్‌లో ఏదో విధంగా చెత్త చేరిపోతుంది. ఇది ఏ వృత్తిలోనై వుంటుంది. ఏదైనా వృత్తిలో జేరకముందు ఆలోచనలు చేరాక ఆలోచనలు చాలా మార్పు వచ్చేస్తుంది. 
 
అసలు కామెంట్లు చేయడం పరమ దరిద్రంగా వుంటాయి. సినిమా చూశాక ఫస్టాఫ్‌ బాగుందని.. సెకండాఫ్‌ బాగోలేదని. లేదా.. ఆ సీన్‌ ఇలా తీస్తే బాగుండేదనిపిస్తుంది. ఈ కామెంట్లు చిత్రంగా వుంటాయి. ఓసారి ప్రసాద్స్‌లో 'ఛత్రపతి' సినిమా చూశాను. ఫస్టాఫ్‌ చూసి మైండ్‌ బ్లోయింగ్‌.. ఎలా తీశాడ్రా అనిపించింది. దాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. నా పక్కన ఎవరో ఫోన్‌లో మాట్లాడుతూ... సెకండాఫ్‌ ఎలా తీశాడో చూడాలి.. అంటూ ఫస్టాప్‌ గురించి మాట్లాడం కూడా ఇష్టపడడంలేదు. నాకు ఇలాగే వుంటే.. రాజమౌళి వింటే పిచ్చేక్కేది. ఇక ఆ తర్వాతనుంచి నేను అక్కడ సినిమా చూడ్డానికి వెళ్ళలేదు. మారుమూల ప్రాంతంలో వెళ్ళి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి చూస్తుంటాను. 
 
ప్రశ్న:  అంటే థియేటర్‌కు వెళ్ళేవారు ఖాళీ మైండ్‌తో వెళ్ళాలా? 
జ : ఏది ఆశించి వెళ్ళినా.. సామాన్యుడు.. బాగుంది. బాగోలేదని చెబుతాడు. అంతేకానీ కక్షతో చెప్పడు. బాగుంది అనేది కూడా కక్షతో చెప్పేవారు వున్నారు. అదో టెక్నిక్‌.. నేను వాటికి దూరంగా వుండాలనుకుంటున్నాను. 
 
ప్రశ్న: థియేటర్‌లో సినిమా చూశాక ఏమనిపించిది? 
జ : బిగినింగ్‌ డల్‌గా వుంటుంది. మొదటి భాగంలో లో స్థాయిలో వుంది. దాన్ని హైప్‌ చేయాలంటే సెకండాఫ్‌.. ఎందుకంటే కథ అలానే చెప్పాలి. ఇంకోరకంగా చెబితే మోసం చేసినట్లవుతుంది. నేను సుదర్శన్‌లో చూస్తుంటే.. హీరో.. సంతకం చేయగానే.. క్లాప్స్‌ కొట్టారు. ఆటో కోసం ఎదురుచూసినప్పుడు ఫీలయ్యారు. ఒక్కోసారి ఇలా తీస్తే ఇంకాబాగుండేది అనిపిస్తుంది. దానికి బడ్జెట్‌ పరిమితులుంటాయి. అవన్నీ తలచుకుంటే.. సిగ్గుతో తలదించుకుని థియేటర్‌ చుట్టూ తిరుగుతుంటాను. నా సినిమాకు లక్షతప్ప్పులు కన్పిస్తాయి. అందుకే ఇంట్లోకూడా నా భార్యతో సినిమా గురించి చెప్పవద్దంటాను. 
 
ప్రశ్న : దేవీ శ్రీ ప్రసాద్‌ బాణీలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి.? 
జ : నాకు తెలిసి బాగానే చేశాడు. 
 
ప్రశ్న : సూపర్బ్‌ సీన్‌ అని ఏదైనా అనిపించిందా? 
జ : అది ఒక్కో వ్యక్తిని బట్టి వుంటుంది. ఈ కథతో ఓ సీన్‌రాసినప్పుడు.. డైనింగ్‌ టేబుల్‌ సీన్‌.. చాలా కష్టపడాల్సి వచ్చింది. హీరో గ్రాఫ్‌ తగ్గకూడదు. రాజేంద్రప్రసాద్‌ భయపడాలి. అందులోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ రావాలి. స్నేహకు ఏమీతెలీనట్లు వుండాలి. సమంతకు అస్సలే తెలీదు. రాసిన తర్వాత ఇలా చేస్తే.. ఎలా వుంటుందని చేశాక.. హైప్‌ వచ్చింది. అప్పుడు బాగుంది అంటే.. ఆ కిక్‌ను దేనితో పోల్చలేం. సూపర్బ్‌ సీన్‌ అని చెప్పలేం. ఏది ఏమైనా.. సూపర్బ్‌ అనేది.. గంట, రెండు గంటలు మాత్రమే ఎంజాయ్‌ చేయగలం. తర్వాత మామూలే. 
 
ప్రశ్న: హీరో అన్నకూతురుకు టీవీషో.. అంటూ అబద్ధం చెప్పడం దేనికైనా స్ఫూర్తా? 
జ : లేదు. అక్కడ పిల్లకు ఎలా అబద్ధం చెప్పాలి.. అది కన్వీనెస్‌గా వుండాలి. హిందీలో ఏదో చిత్రంలో వచ్చినట్లు వుంటే.. సేమ్‌ థాట్‌ వచ్చి వుండవచ్చు. 
 
ప్రశ్న: ఈ చిత్రానికి మీరుకూడా నిర్మాతలేనా? 
జ :  లేదు.. ఇప్పటికి అందరం బాగున్నాం. లేనిపోనివి చెప్పకండి. 
 
ప్రశ్న:  రాజమౌళి చిత్రాలు హిందీలోకూడా వెడుతున్నాయి. మరి మీవి? 
జ :  ఆయన యూనివర్సల్‌ కాన్సెప్ట్‌లు తీసుకుంటారు. అలాంటి కథలు నా దగ్గర లేవు. వారు చేశారని నేను చేయలేను. 
 
ప్రశ్న : సినిమాను పవన్‌ కళ్యాణ్‌ చూశారా? 
జ :  ఆయన ఊళ్లో లేరు. 
 
ప్రశ్న : 'కోబలి' చిత్రం ఎంతవరకు వచ్చింది? 
జ : ఖచ్చితంగా వుంటుంది. దానికి టైం పడుతుంది.

 
Tags:  Star Director's Shocking Comments On His Ego
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1