Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి!

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: May 02, 2015 20:53:09

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తనదైనశైలిలో విమర్శలు వర్షం కురిపించారు. ఆయన శనివారం మాట్లాడుతూ... మోడీ చెప్పే మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని, కేవలం ప్రచారం కోసమే అబద్ధపు వాగ్ధానాలు చేస్తారన్నారు. 
 
దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.. హుదూద్ తుఫాను సాయమేనన్నారు. ఆ సమయంలో వైజాగ్‌లో పర్యటించిన మోడీ.. అంత చేస్తాం, ఇంత చేస్తాం అని చెప్పారన్నారు. తన నోటితోనే వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి, కేవలం 600 కోట్లు ఇచ్చారని చిరంజీవి గుర్తు చేశారు. 
 
ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. రాజధానిపై మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరని ఆయన మండిపడ్డారు. విదేశీ పర్యటనలంటే జోరు చూపే ప్రధానికి దేశ సమస్యలపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. మోడీ మాటలు చెబుతూ ప్రచారం చేసుకునేందుకు ఆరాటం చూపుతారని, అంతకు మించి ఆయన దేశానికి చేసిందేమిటో చెప్పాలని బీజేపీ నేతలకు ఆయన సవాలు విసిరారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు అంటారు... చేతల కొచ్చేసరికి రూ.వంద కోట్లు విడుదల చేస్తారు. ఇది చాలదా, మోడీ మాటల ప్రధాని అని చెప్పడానికి? అంటూ చిరంజీవి మండిపడ్డారు.

 
Tags:  Chiranjeevi Narendra Modi
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1