Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

పవన్ మద్దతు కారణంగా గెలిచిన సీట్లెన్ని ?

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: Apr 14, 2015 19:57:18

ఎన్నికలకు ముందు చంద్రబాబుకు మద్దతుగా పవన్ సుడిగాలి పర్యటనలు చేశాడు. వెళ్లిన ప్రతీచోటల్లా మోదీని ప్రధానిగా, చంద్రబాబుని సీఎంగా చూడాలని వుంది అని చెప్పాడు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల జాతకాలూ తెలిసిపోయాయి. సీమాంధ్రలో టీడీపి భారీ మెజారిటీని పోగేసుకుంది. అంతా అయ్యాక ఇప్పుడు కొందరికి ఓ పెద్ద డౌట్ వచ్చి పడింది. డౌట్ అంటే అలాంటిలాంటి డౌట్ కాదు.. అసలు ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న సీట్లన్నీ పవన్ మద్దతుతో గెలుచుకున్నవేనా లేక చంద్రబాబు కరిష్మాతో సొంతం చేసుకున్నవా అనే సందేహం కొందరి బుర్రల్ని తొలిచేస్తోంది. మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, తాజాగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలని విశ్లేషించుకుంటుండగా వారికి ఈ డౌట్ వచ్చింది. కొన్నాళ్లు వెనక్కి వెళ్తే, మునిసిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగే సమయానికి చంద్రబాబు బీజేపీతో టయ్యప్ పెట్టుకోలేదు. మరోవైపు పవన్ కూడా ఈ ఎన్నికల్లో  బాబుకు మద్దతు ప్రకటించలేదు. అయినప్పటికీ మునిసిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు చాలాచోట్లా బాబుకి అనుకూలంగానే వచ్చాయి. స్థానికంగా బాబుకి గాలి వీస్తోందని ఈ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయి. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనే పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఇక్కడి వరకు ఈక్వేషన్స్ బాగానే వున్నాయి కానీ ఇక్కడే అసలు రిజల్ట్‌ని సందిగ్ధంలో పడేసింది. పవన్ సహాయం తీసుకోకముందు జరిగిన ఎన్నికల్లోనూ బాబు తన సత్తా చాటాడంటే ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన విజయంలోనూ అసలు పవన్‌కు పాత్ర వుందా అనే ప్రశ్నని కొంతమంది ఔత్సాహికులు లేవనెత్తుతున్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబుకి వ్యతిరేకంగా తీర్పు వచ్చి కేవలం అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు మాత్రమే అనుకూలంగా వచ్చి వున్నట్లయితే అప్పుడు అది పవన్ ప్రభావమే అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు కదా అనేది వీరి వాదన. దోశలు వేసేముందు పేనం వేడెక్కిందా లేదా తెలియాలంటే కాసిన్ని నీళ్లు పేనంపై చల్లిచూస్తాం.. మరి ఈ ఎన్నికల్లో పవన్ ప్రభావం వుందో లేదో తెలియాలంటే ఎలా ఏం చేసి చూడాలో అని ఆలోచిస్తున్నారట వాళ్లు. ఈ విషయం తెలిస్తే పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

 

 


 
Tags: పవన్ మద్దతు కారణంగా గెలిచిన సీట్లెన్ని ?
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1