Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

తిరుపతిలో ప్రమాణస్వీకారం

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: May 17, 2014 15:49:34

విభజన అనంతరం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిరోహించనున్నారు. అయితే రాష్ట్ర విభజన తేది జూన్ 2 తర్వాతే ఆ అవకాశం దక్కుతుంది. అప్పటివరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గవర్నర్ పాలనలోనే వుంటాయి. అయితే తన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్వహించేందుకు చంద్రబాబునాయుడు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలన్నీ హైదరాబాద్‌లోనే జరిగాయి. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా వున్న పాంత్రంలోనే అక్కడ సీఎంలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే చేయబోతున్నారు. ఇందకు వచ్చే నెల 2వ తేదీన ముహుర్తాన్ని ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తిరుపతిలోని తారకరామ స్టేడియాన్ని వేదికగా ఎంపిక చేసినట్టు చెబుతున్నారు.  తాజాగా ఎన్నికైన తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం హైదరాబాద్‌లో సమావేశమై తమ ప్రాంత శాసన సభాపక్ష నేతలను ఎన్నుకుంటారు. సీమాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నేతగా ఎంపికవుతే... తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఆర్.కృష్ణయ్య ఎంపికయ్యే అవకాశం ఉంది.

 
Tags: పవన్ మద్దతు కారణంగా గెలిచిన సీట్లెన్ని ?
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1