Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

జగన్ చేసిన ఐదు తప్పులు

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: May 17, 2014 16:00:27

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణాలని విశ్లేషించే పని మొదలైపోయింది. తన తల్లి, చెల్లిని గల్లీగల్లీ తిప్పి...తాను తిరిగి...చెమటోడ్చి చొక్కాలు తడిపేసుకున్నా ఫలితం దక్కలేదు. ఎక్కడ సభలు పెడితే అక్కడ తండోపతండాలుగా రాలిపడ్డ జనాన్ని చూసి...అవన్నీ ఓట్లనo భ్రమల్లో మితిమీరిన ఉత్సాహాన్ని పెంచుకోవడం, దాంతో పాటు క్షేత్రస్థాయి ప్రజల మనోగతాల్ని అంచనాలు వేసుకోలేకపోవడం జగన్ చేసిన మొదటి తప్పు. పైగా సర్వేల పేరుతో ఆయనకు వచ్చి పడ్డ నివేదికలన్నీ తప్పుల తడకలేనంటూ పార్టీ సీనియర్ నాయకులు ఒకరు అసహనాన్ని వ్యక్తం చేశారు. సరైన శాంపిల్ సైజ్ తీసుకోకుండా నిర్వహించే సర్వేల ఫలితాలు కచ్చితంగా తప్పుడు అంచనాలకే దారితీస్తాయన్న నిజాన్ని జగన్ పట్టించుకోకపోవడం ప్రధాన కారణం. ఈ విషయంలో జరిగిపోయిన తప్పిదాన్ని ఇప్పటికీ పార్టీ అధినేత గుర్తించడం లేదన్నది ఆయన వాదన. ఇక రెండో కారణం... మొదటినుంచి (జైల్లో వున్నప్పుడు) కూడా జగన్ అభ్యర్ధుల ఎంపికలో చూపించిన అత్యుత్సాహం పార్టీ యంత్రాంగాన్ని పటిష్ట పర్చుకోలేకపోవడం, నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించుకోవడంతో పాటు వారి పని తీరుతెన్నులను బేరీజు వేసుకోవడానికి, విశ్లేషించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోవడం. ఇక మూడో కారణం...ఒకరిద్దరు జర్నలిస్టుల మీద అతిగా ఆధారపడి వాళ్లు చెప్పే మాటల్ని మాత్రమే తనకనుగుణంగా మల్చుకుని వ్యూహ రచనలో తప్పటడుగులు వేయడం. గతంలో ఈ వ్యవహారాల్ని కొంతమంది సీనియర్ నేతలు ఆయన దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆయననుంచి పెద్దగా స్పందన రాలేదు. దాంతో వారంతా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. కొంతమంది జగన్ స్నేహితులు కూడా నిస్సహాయులుగానే మిగిలిపోయారు. నాలుగో కారణం... పార్టీ అభ్యర్థులుగా ఎంపికైన వారినుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి అంతటితో సరిపెట్టేసి ఎన్నికలప్పుడు వుండే ఖర్చు విషయంలో సహాయం చేయలేకపోవడం. ఇక చివరిది...ఐదోది  జగన్ యాటిట్యూడ్ సమస్య. ‘టూకీగా చెప్పాలంటే అతని వ్యవహారశైలి!’. ఎవర్నీ నమ్మకపోవడం, పార్టీ కీలక యంత్రాంగాన్ని రూపొందించుకోవడం గానీ, వారికి బాధ్యతల్ని అప్పజెప్పడం గానీ, కనీసం వారితో తరచూ సమావేశాలు నిర్వహించి అభిప్రాయాల్ని తెలుసుకోవడంలో గానీ లోపాల్ని సవరించుకోవడంలో గానీ సరైన ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. అతని వ్యవహారశైలితో విసిగి వేసారిన కొంతమంది నేతలు బయటికొచ్చేస్తే మరికొంతమంది మాత్రం తమతమ అవసరాల కోసం మిన్నకుండిపోయారు. ఇవి జగన్ పార్టీ ఘోరపరాజయానికి ప్రధాన కారణాలు. ఉప ఎన్నికల విజయానికి కారణం...అప్పట్లో ప్రజలకు జగన్ పట్ల వున్న సానుభూతి. కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్ని అతడ్ని జైల్లో పెట్టించిందనీ, తండ్రిని కోల్పోయిన ఒక యువనాయకుడని...అటువంటి వ్యక్తి జైల్లో వుంటే అతని తల్లి, చెల్లి ఎండనక, వాననక పార్టీకోసం శ్రమిస్తున్నారనే సానుభూతి అది. కానీ ఎప్పుడైతే జగన్ జైలునుంచి బయటకు వచ్చాడో అప్పటినుంచి ప్రజల్లో మరొక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. కాంగ్రెస్ పార్టీతో ఎన్నికలకోసం మిలాఖత్ అయ్యి బెయిల్ సంపాదించుకున్నాడనే అభిప్రాయం అది. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఇదొక ప్రధాన ఆరోపణాస్త్రంగా దొరికింది. అయితే ఇటువంటి ఆరోపణల్ని ధీటుగా ఖండించే అవకాశం వున్నా జగన్ వాటిని పట్టించుకోలేదు. అంతేకాకుండా ప్రజల్లో సమైక్యాంధ్ర భావన ముందున్నంత స్థాయిలో ఆ తర్వాత లేకపోవడం... ప్రజలు కొత్త రాష్ట్ర నిర్మాణానికి, అభివృద్ధికి ఇచ్చినంత ప్రాధాన్యాన్ని ఎప్పుడో పదేళ్ల క్రితంనాటి చంద్రబాబు అపసవ్య పరిపాలనపై జగన్ చెబుతున్న మాటలకు ఇవ్వకపోవడం. వీటితో పాటు మరెన్నో ఇతర కారణాలు, కొన్ని స్వయంకృతాపరాధాలు జగన్ ఓటమికి ఊతమిచ్చాయి. భవిష్యత్తులో పటిష్టమైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని అలవోకగా చెప్పేసిన జగన్ తన వైఫల్యాలకు ఆత్మవిమర్శ చేసుకోని పక్షంలో మరెన్నో చేదు అనుభవాల్ని చవిచూడవలసి వస్తుందనేది కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు చెబుతున్న మాట. తెచ్చిపెట్టుకున్న ఓటమి కొంతమందిని మరిన్ని తప్పులు చేయడానికి ప్రేరేపిస్తుందని చెబుతారు. విజ్ఞత, వివేకంతో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ అహంభావాన్ని విడనాడితేనే అతనికి...అతని పార్టీకి భవిష్యత్తు.
 

 
Tags: చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1