Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

మోదీ ఘన విజయం

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: May 17, 2014 16:17:25

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ గుజరాత్‌లోని వడోదర నుంచి నాలుగు లక్షల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ మిస్ర్తీని ఆయన ఓడించారు. యూపీలోని వారణాసి నుంచి కూడా మోదీ... తన సమీప ప్రత్యర్థి కేజ్రీవాల్‌పై దాదాపు 80 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. దేశ తదుపరి ప్రధానమంత్రిగా మోదీకి బీజేపీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌కు కంచుకోటగావున్న యూపీలోనూ బీజేపీ ప్రభంజనం కొనసాగడం విశేషం. అటు ప్రధాని మన్మోహన్‌సింగ్ శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ర్టపతి ప్రణబ్‌ను కలిసిన అనంతరం రాజీనామా చేయనున్నారు. ఈనెల 21న మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.మరోవైపు కర్ణాటకలోని షిమోగా నుంచి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గెలుపొందారు. విజయం సాధించిన ఇతర ప్రముఖుల్లో ములాయంసింగ్ యాదవ్ (మెయిన్‌పురి), హర్షవర్థన్ (ఢిల్లీ- చాందినీచౌక్), కిరణ్‌ఖేర్ (చండీఘడ్), వరుణ్‌గాంధీ(యూపీ- సుల్తాన్‌పూర్) వున్నారు. ఇదిలావుండగా నరేంద్రమోదీ... ఫలితాలకు ముందే తన తల్లి హీరాబెన్ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.
 

 
Tags: మోదీ ఘన విజయం
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1