Friday, October 26, 2012 5:42:24 PM
మా గురించి ఇ -పేపర్ లైవ్ టీవి హాట్ న్యూస్ సంప్రదించండి
నరేంద్ర మోడీ.. మాటల మోసకారి... ప్రచారానికే వాగ్ధానాలు : చిరంజీవి! ! | వెబ్‌సైట్లు రివ్యూలు చదవను. టీవీలు చూడను!: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ! | చిత్తూరు జిల్లాలో చినబాబు పర్యటన... చెక్కుల పంపిణీ..! ! | చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు! ! | డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్' అభినందనల వెల్లువ : మోడీ ట్వీట్స్..! ! | మోహన్ బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం... వైట్ బ్యూటీ ప్రశంసల జల్లు..! ! | కార్లచోరీ రాకెట్... మహిళా ఎమ్మెల్యే రూమీనాథ్ అరెస్టు..! ! | బాంధవ్యాలకు చిచ్చు పెడుతున్న ఫేస్ బుక్: సర్వే ! | చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌ ! | గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ ! |

గెలిస్తే పొగుడుతారు.. ఓడితే తిడుతారు : విరాట్ కోహ్లీ

Reported by Kancharana Kiran Kumar, Edited by Kancharana Kiran Kumar | Updated: May 17, 2014 16:26:28

ఒక మ్యాచ్ లేదా సిరీస్‌ను గెలిస్తే ఆకాశానికెత్తేస్తారని, అదే ఓడితే విమర్శలు గుప్పిస్తారంటూ ఆసియా కప్‌లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో పాల్గొనేందుకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఢాకాకు చేరుకున్న విషయం తెల్సిందే.  అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'నేను ఈ ఒక్క టోర్నీకే సారథిని. రెగ్యులర్‌గా కెప్టెన్సీ వహించడం కంటే ఇది భిన్నమైంది. గెలిచినప్పుడు పొగుడుతారు, ఓడినప్పుడు విమర్శిస్తారు. జీవితంలో ఇదో భాగమంతే' అంటూ నిట్టూర్చాడు. ఏదేమైనా తాము గెలిచేందుకే బంగ్లాదేశ్ వచ్చామని చెప్పాడు.  బంగ్లాదేశ్‌లోని పలు వేదికలపై మంగళవారం నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఎల్లుండి బంగ్లా జట్టుతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌లో మార్చి 2న తలపడుతుంది. ఈ మ్యాచ్‌పై కోహ్లీని స్పందన కోరగా, ఆ ఒక్క జట్టుతో పోరునే కీలకంగా పరిగణించరాదని, ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యమైనదే అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 
Tags: చంద్రబాబుతో నందమూరి పవన్ కల్యాణ్‌
 

Related Stories

 
A KIRAN GROUP COMPANY Reg No : 1002/2010  © 2014 Sagar Express.| Terms of Service and Privacy Policy | Power by Shakthitvhi

1