సిని వార్తలు

మా నాన్నే నన్ను లైంగికంగా వేధించాడు: ఖుష్బూ

హైదరాబాద్ : ఇన్నాళ్లూ ఎంతో హుందాగా, ఎంతో గౌరవంగా సినీ హీరోయిన్ అయినా సరే, ఏనాడూ, ఏ వివాదాల్లోకి వెళ్లకుండా తనకంటూ ఒక మార్క్ ఐడెంటిటీ సంపాదించుకున్న నటీమణుల్లో కుష్బూ ఒకరని చెప్పాలి. ఒకానొక సమయంలో కుష్బూకి గుడి కట్టి, దేవతలా ఆరాధించారంటే సినీ అభిమానులు ఆమెను ఎంతగా ఆరాధించారో అర్థమవుతుంది. ప్రస్తుతం ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. అప్పుడప్పుడు అడపదడపా సినిమాల్లో నటిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఝర్ఖాండ్ లో జరిగిన ఒక సదస్సులో ఖుష్బూ మాట్లాడుతూ సొంత తండ్రే తనని లైంగికంగా వేధించాడని చెప్పి సంచలనం సృష్టించారు. ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పేందుకు సిగ్గు పడటం లేదని అన్నారు.

నాకు చిన్నతనంలో జరిగిన అన్యాయాన్ని అందరికీ ధైర్యంగా చెబుతున్నాను అని తెలిపారు. మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం బాధలు పడిందని అన్నారు.. అమ్మ సంపాదించినదంతా పట్టుకుపోయి రోజంతా తాగి వచ్చి అమ్మని, నన్ను కొట్టేవాడని తెలిపింది. 8 ఏళ్ల వయసులో లైంగికంగా నన్ను వేధించేవాడని తెలిపింది. 15 ఏళ్ల వయసులో ఆయన్ని ఎదిరించే శక్తి వచ్చింది. దాంతో మా దగ్గర ఉన్న బంగారం, నగలు, డబ్బులు అన్నీ పట్టుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడని తెలిపింది. మహిళలు ధైర్యంగా ఉన్నప్పుడే ఈ సమాజంలో ఎదురొడ్డి నిలవగలమని, బతక్కగలమని తెలిపింది.

Leave a Reply