ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత… కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ : అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు దేశం పార్టీ సభ్యుల ఆందోళన చేపట్టారు. జీవో నంబర్‌ 1పై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం చేసింది. జీవో రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ.. వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేశారు. పోడియం ముందులి చేరి టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. పరిస్థితి ఇంకాస్త ముదరటంతో అధికార వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు మధ్య ఘర్షణ తలెత్తడంతో ఈ వివాదానికి దారి తీసింది.

Leave a Reply