ఆంధ్రప్రదేశ్

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్, దర్శనం టికెట్లు నేడే విడుదల

తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు దేశానికే ఐకాన్ గా తయారు కావాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఇక్కడ స్కాన్ చేసి భద్రపరచిన మాను స్క్రిప్ట్స్ పై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకుని రావాలన్నారు. మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు ప్రగతిపై సోమవారం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ.

స్వామివారిని దర్శించుకోవడానికి టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం టీటీడీ శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.జూన్ నెలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. స్వామి వారి సేవకు సంబంధించి కూడా టికెట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు జూన్ మాసానికి సంబంధించి మార్చి 23న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడి. ఈ సేవాల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార ఉన్నాయి.

దీంతో పాటు జూన్ నెలకు సంబంధించి పలు ఆర్జిత సేవలకు ఆన్ లైన్ లక్కీడీప్ నమోదుకు మార్చి 24 ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ లక్కీడిప్ లో టికెట్ల వచ్చిన వారు డబ్బులు చెల్లించాలి. అలాగే జూన్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టికెట్లను మార్చి 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు కొటాకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను మార్చి 24న మధ్యాహ్నం టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ఏప్రిల్ నెలకు సంబంధించినవి.

Leave a Reply