ఆంధ్రప్రదేశ్

జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేయాలని చూస్తున్నారు: కొడాలి

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల ఫేజ్ 1 మేనిఫెస్టోపై మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారని.. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు. మరోవైపు బీసీలకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని తెలిపారు. బీసీలు తన వెన్నెముక అని చెప్పుకునే చంద్రబాబు బీసీలు కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు మీడియా అధినేతలను ఎందుకు వెనకేసుకున్నారని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ పాలనలోనే బీసీలు ఎక్కువగా లబ్ధి పొందారని పేర్కొన్నారు. తనయుడు లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేయాలని చూస్తున్నారని కొడాలి ఆరోపించారు.

Leave a Reply