జాతీయ వార్తలు

బంగారం కొనేవారికి అద్దిరిపోయే శుభవార్త, ప్రస్తుతం గోల్డ్‌ రేట్‌ ఏంటంటే..?

ఢిల్లీ : అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధర ఔన్సుకు 1941.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.41 డాలర్ల వద్ద ట్రేడవుతుండటం గమనార్హం. ఇది కొద్దిరోజుల కిందట 19 డాలర్ల వద్ద ఉండేది. ఇక డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.82.72 వద్ద ఉంది. అంటే.. కాస్త పతనమైందన్న మాట. అయితే గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.

దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే తాజాగా గురువారం మాత్రం గోల్డ్‌ ధరలో తగ్గుదుల కనింపించింది. ఈ రోజు తులం బంగారంపై ఏకంగా రూ. 800 వరకు తగ్గింది.దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 54,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,670 వద్ద నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,200 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 59,670 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54, 200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130 ఉంది.

Leave a Reply