జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

శ్రీనగర్‌ : శ్రీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హజ్రత్బాల్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో మూడు వాణిజ్య భవనాలు, ఆరు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఓ హోటల్ లో వంట చేస్తుండగా.. ఆ గదిలో నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ వెంటనే మంటలన్నీ నలుదిశలకు అంటుకొని చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. అక్కడివారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించండంతో.. మొత్తం 16 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పనిలో పడ్డాయి.

భారీ అగ్నిప్రమాదం దాటికి మొత్తం తొమ్మిది భవనాలు దగ్ధం అయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకోదగ్గ విషయం. మంటలు ఆర్పేందుకు స్థానికులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనటంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లైంది. ఉదయం నుండి మొదలుకొని… సాయంత్రం వరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతూనే మంటలు మాత్రం పూర్తిగా అదుపులోకి రాలేదంటే.. మంటలు ఏ రేంజ్ లో వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. చివరికి అందరి కృషి ఫలితంగా మంటల్ని ఆర్పివేశారు.

Leave a Reply