జాతీయ వార్తలు

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,325 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 44,175 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గినా కూడా.. ఇంకా పూర్తిగా తగ్గలేదని.. మహమ్మారి పూర్తిగా అంతం అయ్యేవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాదికారులు సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి.. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడాలని.. చేతులని కాళ్ళని శుభ్రం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply