అంతర్జాతీయ వార్తలు

అత్యధిక బంగారం నిల్వలున్నటాప్ 10 దేశాలు.. అమెరికా టాప్ మరి ఇండియా?

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, అమెరికా :- బంగారం నిల్వలు ఏ దేశం వద్ద ఎంత ఎక్కువ ఉంటే.. ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉన్నట్లు. ఎప్పుడైనా ఆర్థిక సంక్షభం పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ బంగారం నిల్వలే దేశాన్ని దివాలా తీయకుండా కాపాడుతాయి. ప్రపంచ దేశాలు 1800 శతాబ్దం నుంచి ఈ బంగారం నిల్వల విధానాన్ని అనుసరిస్తున్నాయి.

తమ దేశ కరెన్సీకి ఒక రేటు ఫిక్స్ చేసేందుకు ఆ దేశ నిల్వల నిష్పత్తితో మూల్యాంకనం చేయడం ప్రపంచ దేశాలు ప్రారంభించాయి. అయితే 1970లో ,చాలా దేశాలు ఈ విధానానికి స్వస్తి పలికినా.. బంగారం నిల్వలకు ఇప్పటికీ డిమాండ్ పెరుగుతూనే ఉంది.

ఆ దేశాలలోని సెంట్రల్ బ్యాంకులు మళ్లీ బంగారంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ బిజినెస్ వార్తా పత్రిక ఫోర్బ్ ఒక నివేదిక ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం అత్యధిక బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలివే..

ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలున్న దేశాలలో అగ్రస్థానాన్ని అమెరికా కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో జర్మనీ ఉండగా.. భారత దేశం తొమ్మిదో స్థానంలో ఉంది.

అత్యధిక బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాల జాబితా

1.అమెరికా – 8133.46 టన్నుల బంగారం
2.జర్మనీ – 3352.65 టన్నుల బంగారం
3.ఇటలీ – 2451.84 టన్నుల బంగారం
4.ఫ్రాన్స్ – 2436.88 టన్నుల బంగారం
5.రష్యా – 2451.84 టన్నుల బంగారం
6.చైనా – 2191.53 టన్నుల బంగారం
7.స్విట్‌జర్‌ల్యాండ్ – 1040.00 టన్నుల బంగారం
8.జపాన్ – 845.97 టన్నుల బంగారం
9.ఇండియా – 800.78 టన్నుల బంగారం
10.నెదర్ ల్యాండ్స్ – 612.45 టన్నుల బంగారం

Leave a Reply