ఆంధ్రప్రదేశ్

వివేకా హత్య కేసు అరెస్టులు తాడేపల్లి చివరి వ్యక్తి వరకు వెళ్తాయి: అఖిలప్రియ

తాడేపల్లి : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుపై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం వివేకాను సొంత కుటుంబసభ్యులే చంపడం దారుణమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఏ తప్పు చేయనప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టులు ఇంతటితో ఆగవని.. తాడేపల్లిలో ఉన్న చివరి వ్యక్తి వరకు వెళ్తాయని ఆమె వెల్లడించారు. వివేకా హత్య జరిగిన రోజు వైసీపీ నేతలు కట్టుకథలు చెప్పారని విమర్శించారు. విచారణ, అరెస్టులు వాళ్లకు ఫేవర్‌గా ఉన్నప్పుడేమో ఒకలాగా.. లేనప్పుడేమో మరోలాగా మాట్లాడతారన్నారు. వివేకా కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు అఖిలప్రియ పేర్కొన్నారు. కాగా ఇవాళ ఉదయం భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply