జాతీయ వార్తలు

మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్‌ సస్పెండ్

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: మండుటెండలో బస్సు కోసం వేచిచూస్తోన్న మహిళల పట్ల ఆ డ్రైవర్ వివిక్ష చూపించిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఓ బస్‌ స్టాప్‌లో ముగ్గురు మహిళలు ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో వారు ఎక్కాల్సిన బస్సు అక్కడికి వచ్చింది. అయితే డ్రైవర్ ఓ ప్రయాణికుడిని దింపేసి బస్సు ముందుకు పోనిచ్చాడు. మహిళలు పరిగెత్తుతున్నా అతను మాత్రం ఆపకుండానే వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేజ్రీవాల్ డ్రైవర్‌ను సస్పెండ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోను కేజ్రీవాల్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపని డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply