సిని వార్తలు

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ భారీ విరాళం..

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, హైదరాబాద్ :- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి, ఆయన మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు పెట్టుకొని సౌమ్యుడు.. అన్నింటికి మించి దాన గుణంలో కర్ణుడు అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఎన్నో దానాలు చేశాడు. కొన్ని బయటపడతాయి.. మరికొన్ని బయటపడవు. చిత్ర పరిశ్రమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో నేను ఉన్నాను అని ముందు ఉంటాడు ప్రభాస్. ఎవరైనా ఆపదలో ఉన్నారు అన్నా.. సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుంది అన్నా ఆర్థిక సహాయం చేయడంలో ఎప్పుడు వెనుకంజ వేయడు.

తాజాగా ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చూపించాడు. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరగనున్న విషయం తెల్సిందే. ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఇప్పటికే టాలీవుడ్ పెద్దలను ఆహ్వానించేశారు కూడా. ఇక నిన్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన డైరెక్టర్స్ డే ఈవెంట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతీ.. ప్రభాస్ చేసిన మంచిపని గురించి చెప్పుకోచ్చాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించినట్లు తెలిపాడు. ప్రభాస్ కు తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక అంతేకాకుండా డైరెక్టర్స్ అసోసియేషన్ ముందు ముందు అందరి సపోర్ట్ తో మరింత స్ట్రాంగ్ అవ్వాలని మారుతీ కోరాడు. ఇక ఈ ఈ విరాళాన్ని దర్శకుల సంఘం సంక్షేమ నిధి కోసం వెచ్చించనున్నట్లు ఆయన తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మారుతీ- ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Leave a Reply