ఆదిపురుష్ అంచనాలను అందుకుందా..? మూవీ ఎలా ఉందంటే..?
సాగర్ ఎక్స్ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకులను ఆదిపురుష్ మెప్పించాడా? ఆ విషయాలు తెలుసుకుందాం .
స్టోరీ : రాఘవ అంటే ప్రభాస్ తన సతీమణి జానకి అంటే కృతి సనన్, శేషు అంటే సన్ని సింగ్ తో కలిసి వనవాసంలో ఉంటాడు. ఆ సమయంలో రావణ అంటే సైఫ్ అలీ ఖాన్ సాధువు వేషంలో వచ్చి జానకిని తీసుకెళ్తాడు. సోదరి శూర్పణఖ చెప్పిన మాటల ప్రభావంతోపాటు తన సహజ స్వభావం కారణంగా జానకిపై రావణ ఆశ పెంచుకుంటాడు. ఈ క్రమంలో జానకిని తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత రాఘవ తన భార్యను దక్కించుకోవడానికి ఏం చేశాడు? హనుమంతుడు ఎలా సాయం అందించాడు. యుద్ధంలో వానర సైన్యం పోరాటం ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.
రామాయణంలోని ప్రధాన ఘట్టాలను యుద్ధ నేపథ్యంలో 3డిలో తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ తమ పాత్రలకు జీవం పోశారు. ఈ పాన్ ఇండియా మూవీని విజువల్ వండర్ గా రూపొందించారు. డైరెక్టర్ ఓం రౌత్ సినీ ప్రేమికులకు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీల్ కలిగే చేయగలిగాడు.
ప్రభాస్ తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా యుద్ద సన్నివేశాల్లో తన మార్క్ యాక్షన్ తో అదరగొట్టాడు. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. కృతి సనన్ జానకి పాత్రలో ఒదిగిపోయింది. ప్రేమ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ లో కృతి సనన్ హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అలాగే సన్నీ సింగ్, దేవదత్ నాగ్, సోనాల్ చౌహన్ బాగానే నటించారు.
ఈ సినిమాకి కథనమే ప్రధాన మైనస్ పాయింట్ గా మారింది. ఈ సినిమాలో నెక్ట్స్ ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది. పాత్రల గెటప్ లు సరిగ్గా కుదరలేదు. దర్శకుడు ఓం రౌత్ 3డి విజువల్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. కథాకథనాలపై అంతగా దృష్టి పెట్టలేదని అనిపిస్తోంది. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. టైట్ స్క్రీన్ ప్లే , ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది.
కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. అపూర్వ మోతివాలే సహాయ్, ఆశిష్ మ్హత్రే ఎడిటింగ్ కూడా సూపర్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ – అతుల్ , సంచిత్ బల్హార, అంకిత్ బల్హార సమకూర్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పాటల పిక్చరైజేషన్ సూపర్. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
రామాయణం లాంటి అద్భుత దృశ్య కావ్యాన్ని.. ఆదిపురుష్ గా 3డిలో వచ్చిన ఈ మైథలాజికల్ విజువల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 3డి ఎఫెక్ట్స్, ప్రభాస్, కృతి సనన్ నటన, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. తెలిసిన కథ కావడం, సెకెండాఫ్ పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ గా సాగకపోవడం మైనస్ పాయింట్స్. తన స్టార్ డమ్ తో ప్రభాస్ ఈ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రభాస్ ఫాన్స్ ను, చిన్నారులను బాగా మెప్పిస్తుంది.