తెలంగాణ

డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు బయటికి.. స్పందించిన నటి..

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసులు అనేవి చాలా కామన్‌గా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లలో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు అనేవి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అంతే కాకుండా పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా ఈ కేసుల్లో బయటికి రావడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజాగా నిర్మాత కేపీ చౌదరీ డ్రగ్స్ కేసులో నిందితుడిగా బయటపడిన తర్వాత కూడా పలువురి పేర్లు బయటికొచ్చాయి. దీనిపై నటి సురేఖావాణి రియాక్ట్ అయ్యారు.

కేపీ చౌదరీ డ్రగ్స్ కేసులో నిందితుడిగా పోలీసులు చేతికి చిక్కిన తర్వాత.. వారు అతడి ఫోన్‌ను పరిశీలించారు. అందులో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటపడ్డాయి. ఆ కాంటాక్ట్స్‌లో పలువురు తనతో పాటు డ్రగ్స్ తీసుకునేవారని తేలింది. అయితే ఈ లిస్ట్‌లో నటి సురేఖావాణి పేరు కూడా బయటికొచ్చింది. ఇంతకు ముందు కూడా కేపీ చౌదరీతో సురేఖావాణి, తన కూతురు సన్నిహితంగా ఉండేవారు. దీంతో సురేఖావాణి కూడా డ్రగ్స్ తీసుకుంటుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సురేఖావాణి నోరువిప్పింది.

‘గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆలోపణలకు, మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, నా పిల్లల కెరీర్, నా కుటుంబం, ఆరోగ్యం.. అన్నిరకాలుగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి’ అంటూ తానే స్వయంగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది సురేఖావాణి. ప్రస్తుతం సురేఖావాణి విడుదల చేసిన ఈ వీడియోతో పాటు తాను కేపీ చౌదరీతో సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply