తెలంగాణ

చెల్పూర్ కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో భారీ చోరీ

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ 11 వందల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ చోరీ జరిగింది. కేటీపీపీ స్టోర్ లో 1.కోటి రూపాయల విలువచేసే కాపారు, షీలా బుషులు విలువైన సామాగ్రి చోరి అయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో కే.టి.పీ.పి అధికారులు ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగల పనే అని అధికారులు లబోదిపోమంటున్నారు. చోరీ జరుగడంతో టీఎస్ జెన్కో సిఎండి.. స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో చోరీ అవడం ఇదే మొదటిసారని వారు తెలిపారు. ఈ క్రమంలో కే.టి.పీ.పిని ఆధీనంలోకి తీసుకొని టీఎస్ జెన్కో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

Leave a Reply