తెలంగాణ

బాచుపల్లిలో ‘విల్లో వుడ్స్‘ ప్రీ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

రంగారెడ్డి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 1వ డివిజన్ హరితవణం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘విల్లో వుడ్స్‘ ప్రీ స్కూల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ విజయ లక్ష్మీ వెంకట సుబ్బారావు గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రీ స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి.. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్కూల్ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, కార్పొరేటర్లు కొలన్ వీరేందర్ రెడ్డి, చిట్ల దివాకర్, స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి పెనుమత్స, సీనియర్ నాయకులు సుబ్బారావు, చంద్రగిరి సతీష్, సాయి, యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply