పాన్ షాప్ లో చోరీ
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్: వారసిగూడలోని బివైటి వైన్ షాప్ పక్కన ఉన్న పాన్ షాప్ లో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. పాన్ షాపు నుంచి 2వేల నగదు, 20వేల రూపాయలు సామాగ్రి సిగరెట్ ప్యాకెట్లు, పాన్ మాసాల ప్యాకెట్లను అపహరించారు. చిరు వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న పాన్ షాప్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డున పడడంతో దిక్కుతోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.