ఆంధ్రప్రదేశ్

మాణిక్యపురం, డిజిపురం లలో జగనన్న సురక్ష

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, ఇచ్చాపురం: కవిటి మండలంలోని మాణిక్యపురం డిజిపురం సచివాలయాల్లో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 11 రకాల ధ్రువపత్రాలను ఉచితంగా అందజేశారు. అర్హులకు న్యాయం చేసేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం అని అన్నారు. వీరితోపాటు పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply