ఓటీటీలో మీటర్, మ్యాచ్ ఫిక్సింగ్.. మురుగదాస్ మూవీ కూడా.. ఈ వారం 16 రిలీజెస్..
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: OTT: థియేటర్లలో కొత్త సినిమాల కంటే ఓటీటీలో రిలీజెస్ మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు వ్యూయర్స్. సినిమా టాక్ ఏమాత్రం బాగా లేకున్నా.. థియేటర్స్‌కి వెళ్లడం లేదు. ఓటీటీలో వచ్చినప్పుడు ఫ్రీగా చూద్దాంలే అనుకుంటున్నారు. అందుకే, థియేటర్లో మిస్ చేసిన మూవీస్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతాయా? అని ఆసక్తిగా
ఎదురుచూస్తుంటారు. ప్రతీ శుక్రవారం సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుదలతో పండుగ చేసుకుంటున్నారు. మరి, ఈ వారం ఏమి రానున్నాయంటే…
మీటర్:- కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మీటర్’. అతుల్య హీరోయిన్. ఈ మధ్యే థియేటర్లకు వచ్చింది. మే 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఫ్రీనే కదా.. చూసేస్తే పోలా.
నాగశౌర్య, మాళవిక నాయర్ కలిసి నటించిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టైటిల్ వెరైటీగా ఉందికదా. డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల మరి. ఆయన సినిమాలన్నీ ఓ తరహాలో ఉంటాయి. థియేటర్లలో ఓకే టాక్ తెచ్చుకుంది. సన్‌నెక్ట్స్ లో సందడి చేసేందుకు వచ్చేస్తున్నారు ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’.
‘మ్యాచ్ ఫిక్సింగ్’. కామెడీతో కూడిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్. సీనియర్ దర్శకుడు ఇ.సత్తిబాబు డైరెక్షన్. విశ్వంత్, వసంతి కృష్ణన్, ప్రగ్యా నయన్, అభిజీత్ తదితరులు నటించారు. ‘ఈ టీవీ విన్’ మే 5వ నుంచి స్ట్రీమింగ్.
గౌతమ్ కార్తీక్ హీరోగా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ సమర్పణలో వచ్చిన చిత్రం ‘ఆగస్టు 16.. 1947’. ఏప్రిల్ 14న తెలుగులో డబ్బింగ్ మూవీగా రిలీజ్ అయింది. థియేటర్లలో తేలిపోయింది. ఇప్పుడు టెంట్కొట్ట ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కాబోతోంది. మురుగదాస్ ఫ్యాన్స్ ఈ మూవీపై ఓ లుక్కేయొచ్చు.
ఇక అన్నిటికంటే హైలైట్ సినిమా ఏంటంటే.. పవన్ కల్యాణ్ మూవీ ‘తమ్ముడు’, ప్రభాస్ ‘యోగి’ సైతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుండటం. ఇంకేం ఫ్యాన్స్ గెట్ రెడీ…
ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో:
తమ్ముడు (తెలుగు)
యోగి (తెలుగు)
3 (తెలుగు)
రౌడీ ఫెలో (తెలుగు)
అమృతం చందమామలో (తెలుగు)
శాంక్చురీ (మూవీ)
ది లార్వా ఫ్యామిలీ(యామినేషన్)
తూ ఝూటీ మై మక్కార్ (హిందీ)
ఈవారం డిస్నీ+హాట్‌స్టార్‌లో:
కరోనా పేపర్స్ (మలయాళ చిత్రం )
సాస్ బహూ ఔర్ ఫ్లమింగో (హిందీ)
ఈవారం జీ 5లో:
ఫైర్ ఫ్లైస్ (హిందీ సిరీస్)
షెభాష్ ఫెలూద (బెంగాలీ)