తెలంగాణ

చెరువు శిఖం కబ్జా పై స్పందించిన అధికారులు..

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, కరీంనగర్ :- చెరువు శిఖం కబ్జా పై అధికారులు స్పందించారు. గత ఆదివారం దినపత్రికలో వచ్చిన కబ్జా కోరల్లో తాటి పెళ్లి పెద్ద చెరువు కథనాన్ని తాటిపల్లి రైతులు ప్రజావాణి గ్రీవెన్స్ లో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ స్థానిక ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సంబంధిత వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే చెరువును సందర్శించిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు చెరువు శికాన్ని కబ్జా చేసిన వ్యక్తులను ఆరా తీశారు.

చెరువు శిఖంలో మట్టిని పోసి పంట సాగు చేస్తున్న మీసాల సహదేవ్ అనే రైతుకు పోసిన మట్టిని తొలగించాలని లేదంటే చెరువు శిఖం కబ్జాకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని రైతులతో మాట్లాడినట్లు ఇరిగేషన్ డీఈ తిరుపతి తెలిపారు. బీరప్ప చెరువు నుండి నీటిని వాడుతూ చెరువు శిఖంలోకి వస్తున్న రైతుల మోటార్లను తీసివేసినట్లు ఆయన తెలిపారు. చెరువు సందర్శనలో ఇరిగేషన్ డీఈ తిరుపతి, ఏఈ వెంకటేష్, వర్కింగ్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ శాఖ ఆర్ఐ తిరుపతి, సర్వేయర్ ఉన్నారు.

Leave a Reply