తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన భారీ వర్షాలు

ఆంద్రప్రదేశ్ & తెలంగాణ : నిన్నటి నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. పలు జిల్లాలో వడగండ్ల వాన, పలు చోట్ల మంచు గడ్డలతో వర్షం దంచికొడుతుంది. తెలంగాణలోని వికారాబాద్​, సంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మహబూబ్ నగర్ లో ఉరుములతో కూడిన వర్షం ప్రజలను భయభ్రాంతులను గురిచేయగా.. జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. ములుగు జిల్లా గోవిందరావు పేటలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షానికి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పలుచోట్ల పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. మరికొంత మందికి గాయాలయ్యాయి. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ఇక ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉరుములతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. సత్యసాయిజిల్లా మడకశిరలో భారీ వర్షాలు రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. రాష్ట్రంలో వడగాండ్లతో కురిసిన మంచు వర్షంతో రోడ్లన్నీ కాశ్మీర్ ను తలపిస్తునారు. భారీ వర్షాల దాటికి పలుచోట్ల పంటలు తడిసిముద్దయ్యాయి. భారీ వర్షాలకు రాష్ట్రప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply