అన్ని సమస్యలు పరిష్కరిస్తా

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, ఖానాపూర్: శంకర్ గూడా గ్రామంలో ఏర్పడిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని శంకర్గూడా గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు మంగళవారం ఉట్నూరు పట్టణంలో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయనకు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో శంకర్ గూడా గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: