ఆంధ్రప్రదేశ్

కమ్మ, రెడ్డి సెటిలర్లపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. సీనియర్ నేతగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో పేరు పొందారు. గిరిజన నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వవహిస్తున్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రంలోని రెండు ప్రముఖ సామాజికవర్గాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కమ్యూనిటీస్ ప్రజల తీరు వల్ల తన నియోజవర్గం నష్టపోతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మరో హాట్ కామెంట్స్ చేశారు. కమ్మ, రెడ్డి సెటిలర్ల వల్ల సాలూరు ప్రాంతంలోని గిరిజనులకు నష్టం జరుగుతున్నట్లు తెలిపారు. గిరిజన ప్రయోజనాలు కాపాడేందుకు ఈ నియోజకవర్గాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన సెటిలర్లు ఇక్కడి గిరిజనుల దగ్గర సంపాదించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు.

Leave a Reply