జూపిటర్‌లో మార్పులు.. ఎందుకో కనిపెట్టిన శాస్త్రవేత్తలు..
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, వెబ్ డెస్క్: భూమితో పాటు మరెన్నో ఇతర గ్రహాలు కూడా సోలార్ సిస్టమ్‌లో ఉన్నాయి. కానీ భూమిపై జరిగే మార్పులను గుర్తించినంత సులభంగా ఇతర గ్రహాలలోని మార్పులను గుర్తించడం కుదరదు అంటున్నారు శాస్త్రవేత్తలు. అయినా కూడా ఆస్ట్రానాట్స్ ఎప్పటికప్పుడు ఇతర గ్రహాలపై దృష్టిపెడుతూ, వాటిని గమనిస్తూ ఉండడం వల్ల అక్కడ జరిగే మార్పుల గురించి చాలావరకు వెంటనే సమాచారం అందుతుందని తెలుస్తోంది. తాజాగా జూపిటర్ గ్రహంలో కొన్ని మార్పులు జరిగాయి.
జూపిటర్‌లోని గ్యాస్ వల్ల పలు చారలు ఏర్పడ్డాయి. ఎప్పటినుండో ఈ చారలు అలాగే ఉన్నాయి. మామూలుగా ఈ గ్రహంలో ఎర్ర రంగులో ఒక పెద్ద చుక్క ఉంటుంది. దీంతో పాటు జూపిటర్‌పై ఉండే చారలు అప్పుడప్పుడు కదులుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఈ చారలు రంగులు కూడా మారుస్తాయని ఆస్ట్రానాట్స్ కనుగొన్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేదానికి మాత్రం వారి దగ్గర సమాధానం లేదు. తాజాగా జూపిటర్ మ్యాగ్నటిక్ ఫీల్డ్‌పై చేసిన పరిశోధనల్లో ఈ చారలు ఎందుకు రంగులు మారుతాయి అనే విషయం బయటపడింది.
ఒక టెలిస్కోప్ సాయంతో జూపిటర్‌ను చూపినప్పుడు ఆ చారలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మరింత పరీక్షగా చూస్తే ఒకవైపు నుండి మరోవైపుకు గాలులు ప్రయాణించడం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గాలులు అనేవి తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నట్టుగానే కనిపిస్తాయి. భూమిపై ప్రయాణించే గాలుల కంటే ఇవి కాస్త భిన్నంగా ఉన్నాయని చూడగానే అర్థమవుతుంది. ప్రతీ నాలుగు లేదా అయిదేళ్లకు ఒకసారి జూపిటర్‌లో పలు మార్పులు జరుగుతాయి. అందులోని వాతావరణ పరిస్థితులతో సహా. కానీ అలా ఎందుకు జరుగుతాయి అనే విషయం మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు.
జూపిటర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇన్‌ఫ్రారెడ్ వేరియేషన్స్ వల్ల ఆ గ్రహంలో మార్పులు జరుగుతాయని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. కానీ మరో రీసెర్చ్ టీమ్ చేసిన పరిశోధనల్లో ఈ మార్పులు అనేవి గ్యాస్, మ్యాగ్నటిక్ ఫీల్డ్ లాంటి వల్ల కూడా జరుగుతుందని తేల్చారు. నాసా ప్రాజెక్ట్ అయిన జునో మిషన్ ఒకసారి జూపిటర్‌ను పరీక్షించడానికి వెళ్లింది. ఆ మిషన్ ద్వారా తెలుసుకున్న సమాచారంతోనే శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేపట్టారు. మొత్తానికి ఇన్‌ఫ్రారెడ్ వల్లే ఈ మార్పులు జరుగుతున్నాయని ఆస్ట్రానాట్స్ నిర్ధారించారు.