‘అయోధ్య రామయ్యకు విరాళం హర్షణీయం..’ హనుమాన్ హీరోను అభినందించిన కేంద్ర మంత్రి..
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, న్యూఢిల్లీ :- ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా హనుమాన్. యువ హీరో తేజ సజ్జా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ మూవీ హిట్ టాక్ సంపాదించుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. పలువురు సీనీ ప్రముఖులు, రాజకీయ నయకులు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హనుమాన్ హీరో తేజ సజ్జాని కలిశారు. న్యూఢిల్లీలోని అయన నివాసంలో కలిసిన తేజ సజ్జాను కిషన్ రెడ్డి అభినందించారు. దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
‘హనుమాన్’ సినిమాలో తన పాత్రకు గుర్తింపు తెచ్చుకున్న యువ, ప్రతిభావంతుడైన నటుడు తేజ సజ్జాను కలుసుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తన X (ట్విటర్) వేదికగా పంచుకున్నారు.
“అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ సందర్బంగా.. భవ్య రామ మందిరానికి ప్రతి టిక్కెట్టు నుంచి 5.రూ విరాళంగా ఇవ్వడం అభినందించదగ్గ విషయం” అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.