‘RRR’ టీంకు ప్రశంసల వెల్లువ.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
ఢిల్లీ : PM Modi RRR |నేడు జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాల్లో భాగంగా ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ క్రమంలో భారతీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ, సినీ దిగ్గజాలు, ప్రముఖ రాజకేయనేతలు అధినందనలు తెలుపుతున్నారు. RR’ సినిమాలోని ‘నాటు నాటు’కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ రావడం భారత దేశానికి గర్వకారణం అన్నిప్రధాని మోడీ(PM Modi RRR) పేర్కొన్నారు. ఈ అవార్డు తో భారత దేశ కీర్తి మరింత పెరిగిందని అన్నారు.
మరో వైపు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ మోహన్ రెడ్డి ‘RRR’ టీంకు అభినందనలు తెలిపారు. తెలుగు స్థాయిని ప్రపంచాలని చాటి చెప్పిన సినిమా RRR అని కొనియాడారు. ‘నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బృందానికి అభినందనలు.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పరాక్రమాన్ని రెపరెపలాడేలా చేసిన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ తెలిపారు.
అటు వైపు తెలుగు చలన చిత్ర స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయులు గర్వించదగ్గ మూవీ అని.. ప్రతీ భారతీయుడు గర్వించే రోజు ఈ రోజు అని కొనియాడారు. రాజమౌళి టీమ్‌కు నా అభినందనలు.. తెలుగు సినీ పరిశ్రమకు చరిత్రాత్మకమైన కీర్తిని తీసుకొచ్చారు. అవార్డులో రామ్‌చరణ్ పాత్ర కూడా ఉండడం చాలా సంతోషం అని చిరంజీవి కొనియాడారు.
‘RRR’ టీం కు ఆస్కార్ రావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ రూపొందించిన దర్శకులు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్టీఆర్, రామ్‌చరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యకు పవన్ అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ.. భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ట్రిపుల్ ఆర్ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌కు అభినందనలు తెలిపారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం సంతోషం అని అన్నారు. జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, చంద్రబోస్, చిత్ర యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్.