తెలంగాణ

వైఎస్, కేసీఆర్‌లను ప్రశంసించిన చంద్రబాబు

హైదరాబాద్ : హైదరాబాద్ లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో దివంగత వైఎస్సార్, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చంద్రబాబు ప్రశంసించారు. ఉమ్మడి ఏపీకి తాను సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని.. తన తర్వాత సీఎంలు అయిన వైఎస్, కేసీఆర్ కూడా ఆ అభివృద్ధిని కొనసాగించారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసిన వారికి అభినందనలు చెబుతున్నానని తెలిపారు. అలాగే ఏపీలోనూ అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించామని.. తన తర్వాత వచ్చిన జగన్ మాత్రం డెవలెప్ చేయకుండా విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Leave a Reply