తెలంగాణ

కసాయి పెళ్లాం.. ప్రియుడి కోసం రూ.8 లక్షలు.. మోజులో భర్త హత్య..

సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, మేడ్చల్‌ :- ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడిని కడతేర్చింది కసాయి భార్య. ప్రియుడు తనను వాడుకోవాలని చూస్తున్నట్లు ఆమె గుర్తించలేకపోయింది. అతడికి ఏ సాయం కావాలన్నా చేసింది. అవసరం ఉన్నప్పుడల్లా అండగా నిలిచింది. భర్తపై కంటే ప్రియుడిపైనే ఎక్కువ ప్రేమ పెంచుకుంది ఆ మహిళ. అతడికి కష్టాలు రావడంతో తట్టుకోలేకపోయింది. ఏకంగా లోన్ యాప్ ద్వారా 8 లక్షల రూపాయల అప్పు తీసుకుని ఇచ్చింది. ఇన్ని తెలిసినా ఆమె భర్త మామూలుగా మందలించాడు. కానీ ఆమెను దూరం పెట్టలేదు. అయినప్పటికీ ఆ భర్తను అర్థం చేసుకోలేదు ఆ దుర్మార్గురాలు. ఎలాగైనా అతని పీడను వదిలించుకోవాలని కుట్రలు చేసింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించింది.

వివాహేతర సంబంధంతో తన పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంది ఆ మహాతల్లి. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌ హత్యకేసును పోలీసులు ఛేదించారు. నాలుగు రోజుల క్రితం ప్రియుడితో కలిసి భర్తను కావ్య హత్య చేసినట్లు గుర్తించారు. పెట్రోల్‌ పోసి భర్తను తగలబెట్టినట్లు నిర్ధారించారు. ఈ హత్యకు క్యాబ్‌ డ్రైవర్‌తో వివాహేతర సంబంధమే కారణంగా తెలిపారు పోలీసులు. ప్రియుడు ప్రణయ్‌తో కలిసి భర్త స్వామిని హత్యచేయించింది భార్య కావ్య. ఈ దారుణానికి ప్రణయ్ స్నేహితులు రోహిత్‌, నగేష్‌ కూడా సహకరించారు. లోన్‌యాప్‌ ద్వారా 8 లక్షల రూపాయలు తీసుకుని ప్రియుడు ప్రణయ్‌కి కావ్య ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన భార్యపై అనుమానం రావడంతో భర్త స్వామి ఆమెకు వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో ప్రణయ్ సహాయంతో అతడిని చంపేపించింది.

స్వామిని జనవరి 26న తన క్యాబ్ లో ఎక్కించుకుని నిజామాబాద్ కు తీసుకువెళ్లాడు ప్రణయ్. వివాహేతర సంబంధం విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కత్తితో పొడిచి స్వామిని హతమార్చాడు ప్రణయ్. స్వామి మృతదేహాన్ని కౌకూర్ లోని అటవీ ప్రాంతంలో తగలబెట్టాడు. ఈ ఘటనలో ప్రణయ్ కి సహకరించారు అతడి స్నేహితులు రోహిత్, నగేష్. కేసును ఛేదించిన జవహర్ నగర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మృతుడు బాలాజీ నగర్ కు చెందిన స్వామిగా తెలిపారు పోలీసులు.

Leave a Reply